ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 24 : మానవత్వాన్ని చాటుకున్న కానిస్టేబుల్ కందుకుర్తి శ్రీనివాస్. అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న ఆయనకు రోడ్డుపై పడి ఉన్న వ్యక్తి కనిపించగా.. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆయన పరిస్థితిని గమనించాడు. ప్రధాన రోడ్డుపై పడి ఉన్న ఆయనను చూసి జాలిపడిన మొబైల్ పెట్రోలింగ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కందుకుర్తి శ్రీనివాస్ అదే స్థితిలో ఆ వ్యక్తిని ఆయన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. స్పృహ తప్పి పడిపోయిన ఆ వ్యక్తికి మంచినీళ్లు తాగించి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. లెవ్వలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని తానే లేపి ఇంటికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. మానవత్వాన్ని చాటుకున్న కందుకుర్తి శ్రీనివాస్‌ను స్థానికులు అభినందిస్తున్నారు. నిర్మల్ పట్టణంలోని ఈద్గాం ప్రాంతానికి చెందిన కందుకుర్తి శ్రీనివాస్ రెండేళ్లుగా బాసర పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఈ మాదిరి సేవలు అందించి తమ అధికారులు స్థానికులచే పలుమార్లు అభినందనలు పొందాడు.