మాజీ మంత్రి హరీష్ రావు..
ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి మే 14: పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలందరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం లో ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని వెలిబుచ్చే ఈ పవిత్ర కార్యంలో పాల్గొని ప్రజాస్వామ్యం స్ఫూర్తిని ప్రదర్శించిన మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్నదమ్ముళ్లు, అక్క చెల్లెళ్లు, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించిన అధికారులు, పోలీస్ లు అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ శాతం పెరిగిందన్నారు. ప్రత్యేకించి 50 రోజుల పాటు రేయింబవళ్ళు శ్రమించిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.