KTR says.. Everything CM says about loan waiver is nonsense: కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు ఆ పార్టీ నేతలంతా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారి అన్నారు. 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనతో సీఎం బండారం మరోసారి బయటపడిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వంద శాతం రుణమాఫీ పూర్తి చేశామన్న ముఖ్యమంత్రి మాటలన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు.