Trending Now

శిథిలావస్థలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం పరిశీలన..

ప్రతిపక్షం, బోథ్ ప్రతినిధి, మే 22: శిధిలావస్థకు చేరిన తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మార్వో రాజ్ మోహన్ పరిశీలించారు. గత నాలుగు సంవత్సరాల నుంచి శిధిలావస్థకు చేరిన తలమడుగు మండల తహసీల్దార్ కార్యాలయం వదిలి మండల కేంద్రంలో గల వసుంధర మండల సమైక్య శ్రీ శక్తి భవనంలో ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అయితే రెండు నెలల కోసం అని తీసుకొని.. నాలుగు సంవత్సరాలైన శ్రీ శక్తి భవనం నుంచి తహసీల్దార్ కార్యాలయం వెళ్లిపోకపోవడంతో మండల సమైక్య మహిళలందరూ కలిసి తహసీల్దార్ కి భవనాన్ని ఖాళీ చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.

దీంతో దానికి సానుకూలంగా స్పందించిన మండల తహసీల్దార్ రాజ్ మోహన్ మంగళవారం రోజు శిథిలావస్థకు చేరిన తహసీల్దార్ కార్యాలయాన్ని మరోసారి పరిశీలించారు. కార్యాల మరమ్మత్తులు చేయించుట కోసం.. కొత్త భవనం అయ్యేటట్టు జిల్లా అధికారులకు వివరిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ అజీమ్, తహసీల్దార్ సిబ్బంది ఉన్నారు.

Spread the love

Related News

Latest News