Trending Now

మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు స్పందించిన ఏలేటి..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నేను పైరవీ చేసి BJLP పోస్ట్ తెచ్చుకున్నానని చేసిన కామెంట్ సరికాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఖండించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను చేసిన ఆరోపణల మీద ఇన్ని రోజులకైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నేను 19 ప్రశ్నలతో సీఎం కు లేఖ రాశాను.. ఇందులో ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పడం సంతోషమేనని పేర్కొన్నారు. నేను మాట్లాడిన మాటలకు మంత్రి నాపై పర్సనల్ ఎటాక్ చేస్తున్నారని.. దీన్ని నేను ఖండిస్తున్నాని అన్నారు. ఇది కాంగ్రెస్ కాదు.. బీజేపీ లో అందరి సమన్వయంతో నన్ను బీజేఎల్పీ గా నాకు అవకాశం కల్పించారని ఆయన స్పష్టంచేశారు. నేను మీతో కలిసి పదేళ్లు పని చేశాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు పీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలీదా..? మీలా దిగజారి ఆరోపణలు చేయలేను. మా అధ్యక్షుడు అనుమతితోనే నేను సీఎం ను కలవడానికి వెళ్ళాను. నీవు దాన్ని కూడా అనుమాన పడేలా మాట్లాడితే అది మీ సీఎం ను అవమానించడమే.. R ట్యాక్స్, B ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు స్పందించలేదు. U ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థం అవుతుంది. బకాయిలు ఉన్న రైస్ మిలర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. డి – ఫాల్టర్ల పేర్లను బయట పెడతారా? తరుగుపై మంత్రి ఏనాడైనా క్షేత్ర స్థాయిలో ఎపుడైనా పరిశీలించారా.. కుంభకోణాలు కళ్లముందు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఏప్రిల్ 18న జలసౌధలో మిల్లర్ల తో జరిగిన చర్చల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 4 కంపెనీలకు అప్పజెప్పారు.

మీకు FCI ఇచ్చిన గడువు మే 15 న ముగిసింది. FCI ఇచ్చిన గడువు కంటే కాంట్రాక్టర్ల కు మరో నాలుగు నెలలు అదనపు సమయం ఇవ్వడం ఎంటి..? 90 రోజుల్లో ధాన్యం లిఫ్ట్ చేయని కాంట్రాక్టర్ల మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా..? రైస్ మిల్లర్లకు భయపెట్టి వంద రూపాయల స్టంప్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకుంది వాస్తవం కాదా..? మిల్లర్లు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ బయట పెడుతున్న గడువు ముగిసిన ఒక్క బస్తా ధాన్యం కూడా fci కి ఇవ్వలేదు.. దీని వెనకున్న మతలబేంటి..? అని ఆయన ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వార్నింగ్.. నేను రాజకీయంగా మాట్లాడితే.. మీరు పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను పర్సనల్‌గా తీసుకుంటే మీరు చాలా నష్టపోక తప్పదు.. ఇది బాగోదు జాగ్రత్త.. అంటూ ఆయన హెచ్చరించారు. వేలెత్తి చూపిస్తే.. మీ కుందేళ్ళ సప్పుడుకి ఇక్కడ ఎవరు భయపడరు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్‌లో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో తో విచారణ లేదా సీబీఐకి అప్పజెప్పాలి. ఈ అవినీతిపై కేంద్రానికి లేఖ రాస్తానని ఆయన స్పష్టంచేశారు.

Spread the love

Related News

Latest News