Airtel offer to flood victims: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారుల కోసం ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది.
ప్రీపెయిడ్ వినియోగదారులకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ప్రకటించింది. అలాగే కాల్స్ తో పాటు 4 రోజులపాటు రోజుకు 1.5జీబీ డేటా అందించనుంది. ఇక, పోస్ట్ పెయిడ్ వినియోగదారుల బిల్లు చెల్లింపునకు వారంరోజుల పాటు గడువు పొడిగించింది. దీంతోపాటు వైఫై కనెక్షన్ ఉన్న ఇంటికి మరో 4 రోజుల అదనపు వ్యాలిడిటీ కల్పించినట్లు పేర్కొంది. వరదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో మినహాయింపు ఇచ్చినట్లు ఎయిర్ టెల్ తెలిపింది.