Trending Now

మహాబోధి బుద్ధ విహార్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్ వేడుకల్లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని.. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉంది. ప్రతి పనిని ధ్యానంగా  చేయాలన్న సూచన లో చాలా అర్థం ఉంది. ఈ సూక్తి ని నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాను అని తెలిపారు.

ఏ పని అయినా నేను ఎంతో ధ్యానంగా చేస్తాను. ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తాం. ఒక పాఠశాలను నిర్వహించాలని కోరారు. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయి. సమాజంలో స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉంది. బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరమన్నారు. బుద్దుని సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడానికి అవసరమైన సహాయం వ్యక్తి గా, ప్రభుత్వం పరంగా చేస్తాం. ఈ ప్రభుత్వం మీది… అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో బుద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుందని స్పష్టంచేశారు.

Spread the love

Related News

Latest News