పీడీఎస్యూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సింగారి వెంకటేష్..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, 5 : జిల్లాలో స్కూల్ బస్ ఫిట్నెస్ పై రవాణా శాఖ అధికారులు దృష్టి సాదించాలని ఆర్టీవో ఆఫీస్ లో బుధవారం వినతి పత్రం సమర్పించారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సింగరి వెంకటేష్ మాట్లాడుతూ.. కొన్ని రోజులో విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులను తరలించే బస్సుల సామర్థ్యం పక్కాగా ఉండేలా చూడాలని ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపితే చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఫిట్నెస్ లేని బస్సులను వెంటనే సీస్ చేయడంతో పాటు విద్యా సంస్థల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని అన్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు అనుభవం, ఆరోగ్యంగా ఉండేవారిని తీసుకోవాలని, విద్యార్థుల భద్రత, రక్షణ ను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు, స్కూల్ బస్సులోను ఫిట్నెస్ గా ఉండే బస్సులోనే నడపాలని తెలిపారు. విద్యా సంస్థలకు, సూచన చేయాలని అన్నారు. స్కూల్ బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించిన తర్వాతే స్కూల్ బస్సులు నడపాలని, సీట్లకు మించి విద్యార్థులు ఎక్కువగా ఉండకుండా చూడాలని పేర్కొన్నారు.