ప్రతిపక్షం, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను ఇవాళ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అంబర్పేట్ కాంగ్రెస్ ఇన్చార్జి డాక్టర్ రోహిణ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్, డెప్యూటీ మేయర్ శ్రీలత మోతే, లింగోజిగుడ కార్పొరేటర్ రాజశేఖర్ పరిశీలించారు. పరేడ్ గ్రౌడ్స్ ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభాప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్టేజ్ ఏర్పాట్లు, బారికేడింగ్, విద్యుత్, మంచినీటి సరఫరా, మైక్ సిస్టం, LED స్క్రీన్ల ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, వీఐపీ రాకపోకలకు అంతరాయం కలుగకుండా చేపట్టబోయే చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.