Article 370: దాదాపు పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రెండో విడత ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాఔరీ జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. విరుచుకుపడ్డారు. ‘జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ అధికరణం 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారం వచ్చాక ఆ ఆర్టికల్‌ను పునరుద్ధరిస్తామని ఫరూక్ అబ్దుల్లా చెబుతున్నారు. కానీ ఏ శక్తీ దాన్ని తిరిగి తీసుకురాలేదు.’ అని మండిపడ్డారు.