Trending Now

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశమంతా సుభిక్షం

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సుంకిశాల హన్మగౌడ్ మాజీ సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు వారి నిండు ప్రాణాలు భలి ఇచ్చారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పనికి ఆహార పథకం ద్యారా గ్రామాలలో పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ పంచ వర్ష ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తుంది అన్నారు. బీజేపీ ప్రజలకు కులం మతం పేరిట విభజిస్తే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో పేరిట ప్రజలను ఐక్యం చేస్తుందన్నారు. కావున ఈదేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి ఆత్రం సుగుణ గారిని భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి చేయాలనీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మాజీ ఎఫ్ ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ గారి రాజేందర్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమర వేణి నర్సాగౌడ్, ముడుసు సత్యనారాయణ, పాకాల రాంచంధర్, అనుముల భాస్కర్ లక్కకుల నరహరి, పడిగేల రాజేశ్వర్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, తీరు కోవెల వినోద్ కుమార్, మండల ముఖ్యనాయకులు మాజీ సర్పంచ్ రాథోడ్ రాందాస్, మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, కమల్ కోట్ ముత్యం రెడ్డి, రమేష్ రెడ్డి, సాగర్ రెడ్డి, మోతే రాజన్న, తాండ్ర భాస్కర్, నవీన్ రావు, ఇంద్రసేన రెడ్డి, అలీం పాషా, గంగాధర్ మండల, రేఖ్య నాయక్ మాజీ సర్పంచ్, ముఖ్య నాయకులు కార్యకర్తలు మూడువందల మంది పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News