Delhi CM Atishi gets ‘Z’ category security: ఢిల్లీ కొత్త సీఎం ఆతిశీకి ఢిల్లీ పోలీసులు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ఆమె కాన్వాయ్‌లో పైలట్‌తో సహా పోలీసు సిబ్బందితో భద్రత కల్పించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రోటోకాల్ ప్రకారం కేంద్రహోంశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వర్తిస్తుంది. దీంతో ఆతిశీకి రక్షణగా ఢిల్లీ పోలీసులు 22 మందిని షిఫ్టుల వారీగా మొహరించారు. జెడ్ కేటగిరీ భద్రతలో పీఎస్ఓలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అసంఘటిత రంగంలోని కార్మికుల కనీస వేతనాన్ని పెంచింది. అక్టోబర్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయని సీఎం ఆతిశీ వెల్లడించారు. ఈ నిర్ణయంతో నైపుణ్యం లేని కార్మికులకు కనీస వేతనం రూ.18,066, మధ్యస్థ నైపుణ్యం కలిగిన వారికి రూ.19,929, నైపుణ్యం కలిగినవారికి రూ.21,917కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.