ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..? అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. దేశంలో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం.. విద్యుత్ ని తెచ్చింది నెహ్రునని.. FCI ఏర్పాటు చేసి దేశం ఆకలి చావుల నుండి కాపాడింది నెహ్రునేని ఆయన స్పష్టంచేశారు. ఆస్తులు పోగు చేసింది కాంగ్రెస్.. ఆస్తులు ధారదత్తమ్ చేస్తుంది మోడీ అని ఆయన బీజేపీపై ఫైరయ్యారు. 60 ఏండ్లు పాలించిన వాళ్ళు ఏం చేయనిదే.. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చే చేశారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఎవరైనా పీసీసీ పదవి అడగొచ్చు.. ఈ స్వేచ్ఛ వేరే పార్టీలో ఉండదన్నారు. జవహర్ లాల్ నెహ్రు 40 కోట్ల దేశ జనాభాకు తినడానికి తిండి లేని రోజులు.. ఒక్కపూట తిని.. ఇంకో పూట పస్థులు ఉండే పరిస్థితి.. 40 కోట్ల జనాభా కి ఆకలి తీర్చే ప్రయత్నం చేశారని గుర్తచేశారు. మన దగ్గర శ్రీశైలం.. నాగార్జున సాగర్ కట్టారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు.. 70 ఏండ్లలో ఏం చేశారు అంటున్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఆర్ఎస్పీ, మంజీరా, సింగూరు లాంటి ప్రాజెక్టులు కట్టింది. కిషన్ రెడ్డి.. కేసీఆర్ మంజీరా.. సింగూరు నీళ్లు తాగినవాల్లేనని.. ఇవి వాస్తవం కాదా..? అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి కి సూటిగా ప్రశ్నిస్తున్న.. మోడీ పదేళ్ళలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారు..? ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..? విశాఖ ఉక్కు తెచ్చింది మేము.. అమ్మకానికి పెట్టింది మోడీ అని తెలిపారు.
బీజేపీ నేతలకు ఎన్ని కంపెనీలు పెట్టారో.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పగలరా..? దమ్ముందా.. ఏం చేశారో చెప్పుకునే దమ్ము ఉందా.? బీఆర్ఎస్ అంతా మేమే పెంచినం అంటే.. 60 ఏండ్లు పాలించిన వాడు ఏం చేయకుండానే ఈయన చేశాడా..? అని ప్రశ్నించారు. పీసీసీ ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.. తప్పు కాదు బీజేపీ లో పదవులు అడిగితే.. ఉన్న పదవి పోతుంది. బీఆర్ఎస్లో పదవి అడిగే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్‌లోనే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ లు ఎవరైనా ఢిల్లీకి వెళ్లి పదవి అడిగే స్వేచ్ఛ ఉందని స్పష్టంచేశారు.