Trending Now

Nagarjuna: కొండా సురేఖకు షాక్.. పరువు నష్టం దావా వేసిన నాగార్జున!

A shock to Konda Surekha.. Nagarjuna filed a defamation suit: సమంత – నాగచైతన్య విడాకుల విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తన కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించిన మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు.. కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో సినీ పెద్దలంతా ఏకమయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఒక మహిళా మంత్రిగా ఉండి, మరో మహిళ పేరు ప్రస్తావించడం, రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని కుటుంబాన్ని వివాదంలోకి లాగడంపై కొండా సురేఖపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Spread the love

Related News

Latest News