నిర్మల్ జిల్లా బీరవెల్లిలో ఆనవాయితీ కార్యక్రమం..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 8 : మృగశిర కార్తెను పురస్కరించుకొని ప్రతి ఏడాది మాది ఏడూ కూడా నిర్మల జిల్లా సారంగాపూర్ మండలంలోని వీరవెల్లి గ్రామంలో చేపల ప్రసాదం కోసం ప్రజలు పోటెత్తారు. బీరవెల్లి లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చేపల ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన సగ్గం కృష్ణ సోదరులు ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ఈ ప్రసాదాన్ని అందజేశారు. చేపల ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు అన్ని ఏర్పాట్లు చేశారు. వందలాదిగా తరలివచ్చిన వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల సౌకర్యాలను స్థానికంగానే కల్పించారు. శనివారం ఉదయం నుంచే నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ , బోకర్, కిన్వట్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద వ్యాధిగ్రస్తులు తరలివచ్చారు.