Trending Now

మానవత్వం చాటుకున్న యువకుడు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 21 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన మల్లవ్వ గత కొన్నిరోజుల నుండి అనారోగ్యంతో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు కచ్చితంగా ఓ పాజిటివ్ రక్తం కావాలని తెలిపారు. రోగి పలువురికి అడిగిన ఎవరు సాయం చేయక ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్లను సారంగాపూర్ గ్రామానికి చెందిన దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న యువకుల్లో అధ్యక్షులు కిరణ్, దరువు భోజన్న, దృష్టికి తీసుకురాగా సభ్యులు లోకేశ్వరం మండల్ మన్మద్ గ్రామానికి చెందిన మిర్యాల గంగాధర్ కు ఫోన్ ద్వారా వివరించగా వెంటనే వచ్చి రక్తం దానం చేశాడు. మల్లవ్వ కుటుంబ సభ్యులు విషయం తెలుపగానే అత్యవసరంగా రక్తదానం చేసినందుకు దిశా ఫౌండేషన్ సభ్యులకు, రక్తదాత మిర్యాల గంగాధర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, రాజు, రమణ, రాకేష్, కిరణ్, దరువు భోజన్న, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News