Trending Now

‘పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయండి’

ఎంపీడీఓ కార్యాలయం వద్ద సర్పంచ్‌ల నిరసన

ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, జులై 4: పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వరంగల్ జిల్లా నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్‌లు నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీఓ, ఎంపీవో కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే సర్పంచ్ పెండింగ్ బిల్లులను ఇస్తామని ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్న సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సర్పంచుల పెండింగ్ బిల్లులపై స్పందించడం లేదని వారు వాపోయారు.

సర్పంచ్‌లు ఆత్మహత్యలు నిరంతరం ఏదో ఒకచోట అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని.. చనిపోయిన సర్పంచ్ కుటుంబాలకు 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అధికారంలో కి వచ్చి ఏడు నెలలు కావస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా రూపాయి విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. వెంటనే బిల్లులు చెల్లించకుంటే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హోచ్చరించారు.

Spread the love

Related News

Latest News