ప్రతిపక్షం, ప్రతినిధి నిజామాబాద్, మే 22 : ప్రేమించిన ఓ యువతి పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని అరుంధతి నగర్ కాలనీకి చెందిన ప్రమోద్ కుమార్(24) పెయింటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సదరు యువకుడు గత కొద్ది రోజులుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆ యువతిని పెళ్లి చేసుకోవాలంటూ తరచుగా కొరటంతో ఆ యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో మనస్థాపానికి గురైన ప్రమోద్ మంగళవారం రాత్రి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక 3 టౌన్ పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబాన్ని పోషించే ప్రమోద్ మృతితో కుటుంబంలో విషాద నెలకొంది.