Trending Now

కాంగ్రెస్ పాలనలో ఇంకెన్ని చూడాలో..? : మాజీ మంత్రి కేటీఆర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాస్‌బుక్‌లు క్యూలైన్‌లో పెట్టిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమయ్యాయి. పదేళ్లుగా కనిపించని కరెంట్ కోతలు, నీరు లేక ఎండిన పంటలు, బోసిన చెరువులు, అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు, అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నాం. కాంగ్రెస్ తప్పులు-రైతుల తిప్పలు ఆగడం లేదు. ఈ పాలనలో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో?’ అని ఎద్దేవా చేశారు.

”పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం, విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం, కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నం, ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం, సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నం, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నం, చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నం, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నం, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నం, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాం, పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నమని కాంగ్రెస్ పాలనలో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో..?” అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.

Spread the love

Related News

Latest News