Trending Now

కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు రాజీనామాలు చేసి.. వేరే పార్టీలలోకి జంప్ అవుతున్నారు. నిన్న నందికొట్కూరు MLA ఆర్థర్ హస్తం కండువా కప్పుకోగా.. తాజాగా కోడుమూరు మాజీ MLA పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మురళీకృష్ణ 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో మరోసారి బరిలోకి దిగగా.. ఓటమి చెందారు. తర్వాత ఆయన వైసీపీలో చేరారు.

Spread the love

Related News

Latest News