Hyderabad: స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ భారీ విరాళం

Telangana Govt Skills University: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఫౌండేషన్‌ భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి రూ.100 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌.ఈ.జడ్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కరణ్‌ అదానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ పాల్గొన్నారు.

Spread the love

Related News