Trending Now

Haryana elections: అంచనాలు తలకిందులు.. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం

BJP’s Hat-Trick Win in Haryana: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన హర్యానా ఎన్నికల ఫలితాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. హర్యానాలో వరుసగా మూడో సారి భారతీయ జనతాపార్టీ విజయం కైవసం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సీనియర్‌ నాయకులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించి, నయాబ్‌ సింగ్‌ షైనీని ఆ స్థానంలో కూర్చోబెట్టిన మోదీ-షా ద్వయం వ్యూహాలు ఫలించాయి. దీంతో హర్యానాలో కమలం పార్టీ హ్యాట్రిక్‌ విజయం కైవసం చేసుకోవడానికి దోహదం చేసింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా మూడోసారి బీజేపీ ఘన విజయం సాధించింది. కాగా, మ్యాజిక్ ఫీగర్ 46 సీట్లును బీజేపీ క్రాస్ అయింది. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 48, కాంగ్రెస్ పార్టీ 37 చోట్ల గెలిచింది. ఇతరులు 5 స్థానాల్లో గెలిచారు. ఐఎన్ఎల్డీ, ఇతరులను కలుపుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News