Green signal for filling 600 medical posts: రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ పరిధిలోని ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో 600 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్, పరిపాలన డైరెక్టర్ పరిధిలోని ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా భర్తీ చేయనున్నట్లు వివరించారు.
ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 124, డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌లు 7, స్టాఫ్‌నర్సులు 272, గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ 99, గ్రేడ్-2 ల్యాబ్‌టెక్నీషియన్ 34, ఏఎన్‌ఎం 54, రేడియోగ్రాఫర్ 5, మూడు డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజనిస్ట్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్టు ఒక్కోటి చొప్పున భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.