ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 30 : టీవీ రంగానికి చలనచిత్ర రంగానికి సోషల్ ఆక్టివిటీస్ వివిధ కళా రంగాలకు సంబంధించిన వాటిలో ఉత్తమ సేవలు అందించిన అటువంటి వారిని గుర్తించి మెగా ఎంటర్ప్రైజెస్ సంస్థ వారు అవార్డులు ప్రధానం చేశారు. నిర్మల్ జిల్లాకు చెందిన చిత్తూరి మేరీ మాత కుబెస్ట్ షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా హైదరాబాద్ లో బిర్లా మ్యూజియం లో నంది పురస్కారం అందుకున్నారు. ఆమె దర్శకత్వంలో ట్రాంజెండర్స్ లైఫ్ స్టోరీ శ్రీకారం షీ టీం, అనే షార్ట్ ఫిలిం కి అవార్డు రావడం జరిగింది. గత నాలుగు సంవత్సరాలుగా షార్ట్ ఫిలింలో నటిస్తూ ఆమె గుర్తింపు పొందారు. ఎం ఎం క్రియేషన్ అనే యూట్యూబ్ ఛానల్ అనేక షార్ట్ మూవీస్ వారు నిర్మాణ సారథ్యంలో దర్శకత్వం చేసిన శ్రీకారం షీ టీం,వీకెండ్ ఎక్స్చేంజ్ ఇవి షార్ట్ మూవీస్ బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ గా ఎంపికయ్యాయి. అతి త్వరలో ఓల్డ్ ఏజ్ హోమ్ పై డాక్యుమెంటరీ నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. నిర్మల్ లో ఉన్న కళాకారులను గుర్తించి వారికి అవకాశం కల్పిస్తూ వారిలో ఉన్న ప్రతిభను వేలికితీస్తూ ముందుకు కొనసాగుతున్నట్లుగా ఆమె ఈ సందర్భంగా వివరించారు.