Trending Now

గంజాయితో పట్టుబడిన యూట్యూబ్ స్టార్..

ప్రతిపక్షం, తెలంగాణ: యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు. షణ్ముఖ్ తెలుగులో అత్యధిక సబ్ స్క్రైబర్స్ తెచ్చుకున్న సింగిల్ యూట్యూబర్ గా రికార్డ్ కూడా సాధించాడు. తాజాగా పోలీసులు షణ్ముఖ్ అన్న కోసం ఓ కేసు విషయంలో వెళ్లగా షణ్ముఖ్, అతని అన్న సంపత్ గంజాయితో అడ్డంగా దొరికిపోయాడు.

షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కి కొన్ని రోజుల్లో వివాహం కానుంది. అయితే మోనికా అనే అమ్మాయి తనని పదేళ్లుగా ప్రేమించి ఇప్పుడు తనని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి హెసుకోబోతున్నాడు అంటూ సంపత్ పై కేసు పెట్టగా పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇంటికి వెళ్తే అక్కడ అన్నదమ్ములు ఇద్దరూ గంజాయితో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి దాదాపు 16 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

Spread the love

Related News

Latest News