Telangana CM Revanth Reddy: జేఎన్ఏఎఫ్ఏయూకి భూ కేటాయింపులపై అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ విద్యావేత్తలు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ పంపారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కోదండరామ్, హరగోపాల్, ఘంటా చక్రపాణి, దొంతి నరసింహరెడ్డి డిమాండ్ చేశారు. నామమాత్రంగా అతి తక్కువ ఫీజుతో విద్య అందిస్తున్న ఏకైక వర్సిటీ అంబేడ్కర్ యూనివర్సిటీ మాత్రమే అని చెప్పారు. ఆ యూనివర్సిటీని నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని పేర్కొన్నారు.