ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి మార్చి 30: నేటి విద్యార్థులే రేపటి భావిభారత నిర్మాతలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోతం రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మలు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ ఈ టెక్నో హై స్కూల్ 14వ వార్షికోత్సవం శనివారం ఉపాధ్యాయ భవన్( టిటిసి భవన్) లో ఘనంగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కూర రగోతం రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మలు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రముఖ విద్యావేత్త జగ్గు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాకతీయ ఈ టెక్నో స్కూల్ అన్ని రంగాల్లో రాణించడం విశేషం అన్నారు.
జగ్గు మల్లారెడ్డికి విద్య వ్యవస్థలో అశేష అనుభవం ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా కీలకమైందని, ఒక ఉపాధ్యాయుడు దేశాన్నిఅభివృద్ధి చేయడంలో ముఖ్య భూమిక వహిస్తాడన్నారు. ఒక ఉపాధ్యాయుడు ఇంజనీర్, డాక్టర్, రాజకీయవేత్త, ఇలా అన్ని రంగాల్లో రాణించే విధంగా తమ విద్యార్థులను తీర్చిదిద్దగలుగుతారన్నారు. అనంతరం విద్యార్థులు తమ ఆటపాటలతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, అతిథులను ఆనందింప చేశారు.