[t4b-ticker]

సినిమా విజయానికి ట్రైలర్‌ చాలా కీలకం: నాగార్జున

ప్రతిపక్షం, ఆగస్టు 10: సినిమా విజయానికి ట్రైలర్‌ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ట్రైలర్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ప్రేక్షకులు ట్రైలర్‌ చూసిన తర్వాతే సినిమా చూడాలా? వద్దా? అనే నిర్ణయానికి వస్తారని తెలిపారు.

ప్రతి సినిమాపై ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉంటాయని నాగార్జున చెప్పారు. ట్రైలర్‌ ద్వారా సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి, నమ్మకం ప్రేక్షకుల్లో కలగాలని.. వారి అంచనాలను సినిమా అందుకోగలిగితేనే థియేటర్లకు వస్తారని అభిప్రాయపడ్డారు. అందుకే సినిమా ప్రమోషన్‌లో ట్రైలర్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.

ఇటీవల విడుదలైన ‘రామాయణ’ సినిమా ట్రైలర్‌పై నాగార్జున ప్రశంసలు కురిపించారు. ట్రైలర్‌ అద్భుతంగా ఉందని పేర్కొన్న ఆయన.. ఇందులో నటించిన రణ్‌బీర్ కపూర్, యశ్ నటన తనను ఆకట్టుకుందని తెలిపారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొందని చెప్పారు.

Spread the love

Related News

Latest News