[t4b-ticker]

రేపు ఆకాశంలో మూడు అద్భుత దృశ్యాలు.. కనువిందు చేయనున్న ఖగోళ వింతలు

ప్రతిపక్షం, ఆగస్టు 11: ఆకాశ వీక్షకులకు రేపు అరుదైన ఖగోళ దృశ్యాలు కనువిందు చేయనున్నాయి. ఒకే రోజున మూడు విశేషమైన ఖగోళ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గురుడు, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్చ్యూన్‌ గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. వీటిలో కొన్ని గ్రహాలను కంటితో స్పష్టంగా చూడొచ్చని, మరికొన్నింటిని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరమవుతాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదే సమయంలో 109పీ/స్విఫ్ట్‌-టట్లీ తోకచుక్క వదిలిన ధూళి, శిథిలాల కారణంగా ఏర్పడే ఖగోళ వర్షం కూడా కనిపించనుంది. అమావాస్య సమయం కావడంతో ఆకాశం మరింత చీకటిగా ఉండి ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే ఖగోళ వస్తువులు మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

మరోవైపు ఇదే సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం కూడా సంభవించనుంది. అయితే ఈ సూర్యగ్రహణాన్ని భారత్‌లో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేదు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల నుంచి మాత్రమే ఈ అరుదైన దృశ్యాన్ని చూడవచ్చు. ఒకే సమయంలో మూడు ఖగోళ విశేషాలు చోటుచేసుకోనుండటంతో ఖగోళ ఆసక్తి ఉన్నవారికి రేపటి రోజు ప్రత్యేకంగా మారనుంది.

Spread the love

Related News

Latest News