[t4b-ticker]

పోలీస్ పరేడ్ మైదానం లో ఘనం గా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్ ఆగస్టు 15: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం వందేమాతరం, జనగణమన, తెలంగాణ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్ ఎమ్మెల్యే లు ధన్పాల్ సూర్య నారాయణ, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర వ్యవసాయ కమీషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News