[t4b-ticker]

స్వాతంత్ర్య సమరయోధులు – నినాదాలు

ప్రతిపక్షం, ఆగస్టు 15: భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహనీయులు తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు వారు ఇచ్చిన నినాదాలు నేటికీ ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలిస్తూనే ఉన్నాయి. ఆ మహనీయుల స్ఫూర్తిదాయక నినాదాలు ఇవే..

బాల గంగాధర్ తిలక్: “స్వరాజ్యం నా జన్మహక్కు.. దానిని నేను పొంది తీరుతాను.”

మహాత్మా గాంధీ: “కరో యా మరో.”

సుభాష్ చంద్రబోస్: “నాకు రక్తం ఇవ్వండి.. మీకు స్వాతంత్ర్యం ఇస్తాను.”

భగత్ సింగ్: “ఇంక్విలాబ్ జిందాబాద్.”

అల్లూరి సీతారామరాజు: “మనదే రాజ్యం.”

జవహర్‌లాల్ నెహ్రూ: “ఆరామ్ హరామ్ హై.”

చంద్రశేఖర్ ఆజాద్: “శత్రువుల తూటాలను ఎదుర్కొంటాను.. నేను స్వతంత్రుడిగానే బతికాను.. స్వతంత్రుడిగానే చస్తాను.”

ఈ నినాదాలు కేవలం మాటలు మాత్రమే కాదు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి ప్రతీకలు. వారి స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ దేశ అభివృద్ధి, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడం వారికి ఇచ్చే నిజమైన నివాళి.

Spread the love

Related News

Latest News