ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 16: తెలంగాణ ఉద్యమకారుడు మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ కు ఇటీవల కాలికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలుసుకుని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు , కోఆర్డినేటర్ మాడుగుల రాములు అధికార ప్రతినిధులు మహమ్మద్ ఫయాజ్ అలీ మార్వాడి సుదర్శన్, కో కన్వీనర్ గరిగే కోటేశ్వర్, ఆంజనేయస్వామి ఆయన గృహానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి నాయక్ త్వరగా కోలుకోవాలని టీజేఏసీ నాయకులు అన్నారు పరామర్శించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.





























