CM Revanth Reddy Review Meeting: గణేష్ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి గిఫ్ట్వినాయక చవితి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నగరంలో ఉత్సవాల నిర్వహణకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలన్నారు. మండపాల ఏర్పాటుకు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో అనుమతి తీసుకోవాలన్నారు.
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం చెప్పారు. వచ్చే నెల 16న మిలాద్ ఉన్ నబీ, 17న పలు రాజకీయ పార్టీల కార్యక్రమాలు ఉన్నందున ప్రణాళికతో ముందుకు వెళ్లలన్నారు. ఎక్కడా సమస్యలు రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.