long iron pole on railway tracks: దేశంలో గత కొంతకాలంగా రైళ్ల ప్రమాదానికి భారీ కుట్ర జరుగుతోంది. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో రైలు ప్రమాదానికి పన్నిన కుట్ర భగ్నమైంది. లోకో ఫైలట్ అప్రమత్తంతో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఉత్తరాఖండ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న బల్వంత్ ఎన్‌క్లేవ్ కాలనీ వెనుక నైనీ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణిస్తున్న ట్రాక్‌పై ఏకంగా 6 మీటర్ల పొడవైన టెలికాం స్తంభాన్ని ఉంచారు. డెహ్రాడూన్ (డూన్) ఎక్స్‌ప్రెస్ అక్కడి నుంచి వెళ్తుండగా రైల్వే ట్రాక్‌పై స్తంభాన్ని చూసిన రైలు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న జీఆర్‌పీ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్‌పై ఉన్న పిల్లర్‌ను అధికారులు తొలగించారు.