ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 12 : జాతీయ స్థాయి తైక్వాండో పుంసే అండర్ 30 కెటగిరిలో ఏకైక వ్యక్తి నిర్మల్ జిల్లా ఈదిగాం కి చెందిన ధ్యాయత్ అక్షయ్ ఒరిస్సా లో జూన్ 29 రోజు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో అవకాశం దక్కించుకున్నాడు. గత నెల 7 న హైదరాబాద్ లో జరిగిన పరీక్షలలో ఎంపిక అయ్యారు. ఆరు సంవత్సరాలుగా దృఢ సంకల్పంతో అను నిత్యం సాధన చేస్తూ.. తల్లిదండ్రుల సహకారం, కృషి తో తన గురువు నాగరాజు సూచనలు తో ఏకాగ్రత గా సాధన వల్లే జాతీయ స్థాయి లో జరిగే పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి 2024 సంవత్సరం లో ఏకైక వ్యక్తి గా నేను ఎంపిక అవ్వటం చాలా సంతోషంగా ఉందని, మీ అందరి ఆశీస్సులతో జూన్ 29 నా జరిగే జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించి, దేశంలో నే మన తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా పేరు ను నిలబెడతనని, తల్లిదండ్రులకు పుట్టిన గడ్డ కు మంచి పేరు తీసుకొస్తానాని తెలిపారు. గతంలో జిల్లా, రాష్ట్ర, స్థాయిల్లో అనేక సందర్భాలలో విజయం సాధించనని తెలిపాడు.