Trending Now

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించండి..

సోన్ మండలంలో కాంగ్రెస్ మహిళా నాయకుల ప్రచారాలు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 24 : అదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ.. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సిద్దలకుంట న్యూ వెల్మల్ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్నమైన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వైఫల్యాలను వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం లోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది మతి అల్లూరి కృష్ణవేణి నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంబరి గంగాధర్, సోన్ మండల నాయకులు మధుకర్ రెడ్డి, గడ్డం నర్సా రెడ్డి, గడ్డం చిన్న నర్సా రెడ్డి, శేఖర్, ప్రవీణ్, సాయన్న, వినోద్, రవి, వాసవి, లక్ష్మి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News