[t4b-ticker]

కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్న నరేంద్ర మోడీ

•మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాస్తారోకో

వనపర్తి ప్రతినిధి, ఆగస్ట్ 10, ప్రతిపక్షం: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం ఏఐటియూసి, సిఐటియూ, టియూసిఐ,రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్ వద్ద గంట పాటు భారీగా రాస్తారోకో నిర్వహించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు, కార్మిక సంఘాల నాయకులు మధ్య తోపులాట చోటుచేసుకుంది.అనంతరం కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మిక సంఘాల నాయకులను విడుదల చేయాలని కార్మికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద నినాదాలు చేశారు.

దీంతో సొంత పూచీకత్తుపై కార్మిక సంఘాల నేతలను పోలీసులు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏఐటియూసి జిల్లా కార్యదర్శి.మోష, ఉపాధ్యక్షులు గోపాల కృష్ణ,సిఐటియూ నాయకులు రమేష్, మండ్ల రాజు,టియూసిఐ నాయకులు కుర్మయ్య, అరుణ్ కుమార్, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని, నూతన విత్తన, విద్యుత్‌ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం చేయాలని కోరారు. కార్మిక, కర్షక ఐక్యతతో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.సిపిఎం, సీపీఐ నాయకులు పుట్ట ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News