[t4b-ticker]

ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి శ్రీహరి

ప్రతిపక్షం, ఆగస్టు 10, హైదరాబాద్: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో ప్రియాంక భౌతికకాయాన్ని మంత్రి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పరామర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ప్రియాంక తండ్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు.

ప్రియాంక మృతి అత్యంత విషాదకరమైన ఘటన అని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘటనపై వెంటనే స్పందించి, ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించాలని మంత్రులు, అధికారులను ఆదేశించారని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని నిందితులు తప్పించుకోకుండా నిబంధనలను మరింత కఠినతరం చేయాలని అన్నారు. ప్రియాంకకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

Spread the love

Related News

Latest News