ప్రతిపక్షం, ఆగస్టు 14: హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆదేశించారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారం విద్యార్థులకు, తనకు మధ్య ఉన్న అంశమని పేర్కొన్నారు.
వర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సీజేఐని ఆహ్వానించవద్దంటూ నల్సార్ విద్యార్థులు లేఖ రాశారు. దీనిపై బీసీఐ తొలుత విద్యార్థులపై చర్యలకు సిద్ధమైంది. అనంతరం ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో స్పందించిన సీజేఐ.. విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బీసీఐకి స్పష్టం చేశారు.





























