[t4b-ticker]

మహిళా సంఘాలకు రూ.9.25 కోట్ల ఆర్థిక చేయూత

ప్రతిపక్షం, ఆగస్టు 15, సిద్దిపేట: మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని 64 మహిళా సంఘాలకు రూ.9.25 కోట్ల విలువైన చెక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.

మహిళలు స్వయం ఉపాధి, చిన్నతరహా వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల ద్వారా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మహిళా సంఘాలకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆదాయాన్ని పెంచుకునే దిశగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే కుటుంబం, సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు అందించిన ఈ ఆర్థిక సహాయం ద్వారా పలువురు మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News