- విద్యార్థులకు విద్య దూరం చేసే ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలి
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుని లు రాస్తారోకో
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 19: ప్రభుత్వ పాలిటెక్నిక్ లను ప్రవేట్ పరం చేయడంపై .రాష్ట్ర ప్రభుత్వం జీవో 97 వెంటనే రద్దు చేయాలని కోరుతూ పాలిటెక్నిక్ విద్యార్థినిలు మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరిచుకోవాలని అన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అవలంబించడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింరు .జీ.వో.ఎం.ఎస్.నెం: 97/ 2026 లో పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కార్తీక్, శ్రీ విద్యా, సోనీ మాజీ జిల్లా కార్యదర్శి సంతోష్ విద్యార్థుని లు పాల్గొన్నారు.































