[t4b-ticker]

అర్హులకు సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 19: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు.
మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలో పాండ్రాల స్వప్న–ప్రవీణ్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అండగా నిలుస్తాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న స్వప్న–ప్రవీణ్ దంపతులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, స్థానిక సర్పంచ్ కనకం సుజాత- సంపత్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కనకం కుమార్, గట్టు దుద్దెనపల్లి చైర్మన్ సొసైటీ చైర్మన్ గంగుల రాంరెడ్డి, వైస్ చైర్మన్ కనక రాజేశం, పార్టీ నాయకులు ఓదెల యాదవ్, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, రామిడి తిరుమల్ రెడ్డి, వై.సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బాకారపు సమ్మయ్య,బి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News