- ఫోటో, వీడియో జర్నలిస్టులను సన్మానించిన కేంద్ర మంత్రి
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్,ఆగస్టు 19: ‘‘ఫొటో, వీడియో అంటే ఒక క్షణాన్ని మాత్రమే బంధించదు… ఆ క్షణం వెనుక ఉన్న చరిత్రను బంధిస్తుంది. మనం మరచిపోయే ఎన్నో జ్ఞాపకాలను ఫొటో, వీడియో గ్రఫీ మన కోసం భద్రపరుస్తుంది. అందుకే ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ కెమెరా పట్టుకున్న వ్యక్తి మాత్రమే కాదు… గత చరిత్రకు, వర్తమాన కాలానికి సాక్షి‘‘అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కరీంనగర్ లోని ఆర్ అండ్ బి అతిథి గ్రుహంలో ఫోటో జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. అనంతరం కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టుల సేవలను కొనియాడారు.





























