[t4b-ticker]

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసపూరిత పార్టీలే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్

ప్రతిపక్షం, ఆగస్టు 19: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఈనెల 27 నుండి ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టిన పోరుబాటకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే యుద్దంలో బీజేపీ సైనికులే ముందుండి పోరాడేందుకు సిద్ధమన్నారు. ‘‘ఈ యుద్దంలో మీ కంటే ముందు మేమే ఉంటాం. పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే ఆ దెబ్బలు మేమే తింటాం. తూటాలు పేలిస్తే ఆ తూటాలకు మేమే బలయ్యేందుకు సిద్ధం’’అ ని భరోసా ఇచ్చారు. జేఏసీలో ఒకరిద్దరు నాయకులు ప్రభుత్వానికి అమ్ముడుపోయి ఉద్యమాన్ని వాయిదా వేయడం పరిపాటిగా మారిందని, అట్లాంటి వాళ్లను ఇకపై జేఏసీలో కొనసాగించవద్దని కోరారు. గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని ఆర్ అండ్ బి అతిథి గ్రుహంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. సమాజానికి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం తదితరులతో కలిసి ఉద్యోగుల జేఏసీ పోరుబాటుకు మద్దతుగా మాట్లాడారు.

Spread the love

Related News

Latest News