[t4b-ticker]

మృతుని కుటుంబానికి 20 లక్షల రూపాయల ప్రమాద భీమా

చెక్కును అందజేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు .

ప్రతి పక్షం చండూరు ఆగస్టు 19: చండూర్ మండలం నేర్మట గ్రామానికి చెందిన బొడ్డుపల్లి శంకర్ (హైదరాబాద్) సైదాబాద్ లో ఉంటు ఉప్పరి పనిలో దినసరి కూలి ప్రమాదవషాత్తు రెండు అంతస్థుల పై నుండి క్రింద పడి ప్రమాద వషాత్తు మరణించాడు.ఇతనికి ఒక కొడుకు, ఒక బిడ్డ సంతానం కలదు. చండూర్ లోని తెలంగాణ నాగార్జున గ్రామీణ బ్యాంక్ లో ప్రమాద బీమా సంవత్సరానికి వేయ్యి రూపాయలు చెలించినందుకు గాను ప్రమాద బీమా వర్తించగా బ్యాంక్ వారు బుధవారం రోజు నేర్మట గ్రామపంచాయతీ కర్యాలయం ఆవరణలో సమావేశం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు ఇరవై లక్షల చెక్కు భార్య సుమతమ్మ కి బ్యాంక్ మేనేజర్ బెనర్జీ కృష్ణ , రీజినల్ మెనేజర్ కె. శివ కుమార్, పలువురు సమక్షంలో అందచేశారు.ఈ కార్యక్రమంలో నేర్మట గ్రామ సర్పంచ్ వసంత దనయ్య, నారపాక శంకర్,నర్సింహా,నందికొండ సత్తిరెడ్డి, యాదయ్య, నారపాక దశరథ, ఏ.పి.ఎం యాదయ్య, పరందాములు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News