[t4b-ticker]

ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి విశేష స్పందన భారీగా తరలివచ్చిన ప్రజలు

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ ఆగస్టు 19: ప్రజా సమస్యలను నేరుగా విని, వాటికి సత్వర పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం (PwD), సీనియర్‌ సిటిజన్స్‌, ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధానానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.ఈ కార్యక్రమం అనంతరం గాంధీభవన్‌లో మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి ప్రతి వినతిని పరిశీలించిన మంత్రి.. సంబంధిత శాఖలు, అధికారులు, జిల్లా యంత్రాంగానికి వాటిని పంపించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో కార్యక్రమం ముగిసిపోదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను పర్యవేక్షిస్తూ.. సమస్య పరిష్కారం అయ్యే వరకు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు. అత్యవసర సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని, మిగిలిన సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.ఎస్సీలు, గిరిజనులు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌, ట్రాన్స్‌జెండర్లు, పేదలు, అణగారిన వర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యంతో పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. ‘ప్రజల వద్దకే పాలన’ అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని చెప్పారు.కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన వినతులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సానుకూల దృక్పథంతో పరిశీలించి, నిబంధనల పరిధిలో సాధ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.“ప్రజల సమస్యలను వినడమే కాదు.. వాటికి పరిష్కారం చూపే వరకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండే పాలనే మా ప్రభుత్వ విధానం” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌పై మంత్రి ధ్వజం

హౌస్‌ అరెస్టుల గురించి బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మండిపడ్డారు. 2014 నుంచి 2023 వరకు ప్రతిపక్ష నేతలను ఇంటి నుంచి బయటకు రానిచ్చారా? అని ప్రశ్నించారు.తాను మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్‌ సిరిసిల్లకు వచ్చిన సందర్భంలో తనను ధర్మపురిలో హౌస్‌ అరెస్టు చేసేవారని గుర్తుచేశారు. నాడు ప్రతిపక్ష నేతలను నిర్బంధించిన వారు.. నేడు హౌస్‌ అరెస్టులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.గత పాలనలో ప్రజల గొంతుకకు అడ్డుకట్ట వేస్తే.. తమ ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను వింటోందని చెప్పారు.

గత పాలనకు భిన్నంగా ప్రజా ప్రభుత్వం

గత బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు సరైన వేదిక లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. దీనికి భిన్నంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే పాలనను అమలు చేస్తోందన్నారు.

Spread the love

Related News

Latest News