Trending Now

‘డబుల్ బెడ్ రూమ్‌లను పంపిణీ చేయండి’.. కలెక్టర్‌కు వినతి పత్రం

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 27 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు డబుల్ బెడ్ రూం లను పంపింణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుని అధికారులు సహకరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. అర్హత కలిగి ఉన్న తమకు డబల్ బెడ్ రూములు లభించకపోవడంతో వేలాది రూపాయలు అద్దెల రూపంలో చెల్లించి ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా డబల్ బెడ్ రూంల కోసం దరఖాస్తులు చేసుకున్న అర్హత ఉన్న తమను కాదని అనర్హులెందరికో డబుల్ బెడ్ రూంలను పంపిణీ చేయడం జరిగిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో సీపీఎం (ఎల్) జిల్లా కార్యదర్శి సయ్యద్ మహమూద్, వికలాంగుల జిల్లా అధ్యక్షులు సట్టి సాయన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ రవి, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కే. సంజీవ్, ఏ. దత్తు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News