[t4b-ticker]

చండూరులో వేడెక్కిన రాజకీయ వాతావరణం

*అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి.
*చండూరు మున్సిపల్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము.
*BRS ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధినే ప్రజలు కోరుకుంటున్నారు.
*బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్ .

ప్రతి పక్షం చండూరు, ఆగస్టు 19: బీఆర్ఎస్ పార్టీ చండూరు పట్టణ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ గారి అధ్యక్షతన బుధవారం రోజు చండూరు మున్సిపల్ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అని కొనియాడారు. మునుగోడులో ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు త్వరలో ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత BRS ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు లాంటి సంక్షేమ పథకాలను రద్దు చేసే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆ పథకాలను వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

కోమటిరెడ్డిపై ఫైర్
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి, మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి చండూరు మున్సిపల్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కోమటిరెడ్డి అనుచరులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

“మునుగోడులో అభివృద్ధి శూన్యం”

మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని, KCR నాయకత్వంలో BRS ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధినే ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి, చంద్రశేఖర్, సామ సుజాత యాదవరెడ్డి, కొండ్రెడ్డి మధు, BRS నాయకులు ఇరిగి రామన్న, పెండ్యాల గీత, నందికొండ నర్సిరెడ్డి, చొప్పరి దశరథ, వీరళ్ళ స్వామి, చిలివేరు నరేష్, తాండారి రవి, బోడ మోహన్, భూతరాజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News