Shock for food lovers.. Ban on Swiggy in AP: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీని ఏపీ వ్యాప్తంగా బాయ్ కాట్ చేస్తున్నట్లు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 14 నుంచి రాష్ట్రంలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్లలో స్విగ్గీకి ఆర్డర్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు, స్విగ్గీ, జొమాటో కారణంగా హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 12, 27, సెప్టెంబర్ 27వ తేదీన ముడు దఫాలుగా స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో చర్చించామన్నారు. తమ అభ్యంతరాలను జొమాటో కొంతవరకు అంగీకరించిందని, స్విగ్గీ మాత్రం కాలయాపన చేస్తూ వస్తోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.