ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 16: కరీంనగర్ పట్టణ గంగపుత్ర (బెస్త) సంఘం ఆధ్వర్యంలో మానేరు డ్యాం వద్ద గంగమ్మ తల్లికి బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పవిత్ర గంగమ్మ బోనాల జాతరకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి దివ్య ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం ప్రతినిధులు మేయర్ కొలగాని శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మేయర్ ఆకాంక్షించారు.గంగమ్మ బోనాల జాతర సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించగా, మానేరు డ్యాం పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్, నాంపల్లి రేణుక శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు బల్వీర్ సింగ్, పట్టణ గంగపుత్ర సంఘం నగర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, నాగుల రాజారాం, కోశాధికారి, గడప నర్సింహస్వామి, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ఇతర కార్యవర్గ సభ్యులు, గంగపుత్ర సంఘం ప్రతినిధులు మరియు పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.





























